Thursday, January 6, 2011

బహుముఖ వేషధారి


నటనా రంగానికి మాతృక వంటిది నాటకం. నాటక రంగంలో రాణించిన అనంతరం సినిమాల్లోకి వచ్చి ఉత్తమ నటులుగా పేరు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. కానీ వీరంతా సినీ రంగానికి వచ్చిన తర్వాత నాటకాన్ని మరచిపోతుంటారు. కానీ తనకు పేరు తెచ్చిన నాటకాల్లో నటిస్తూనే సినీ, టీవి రంగంలో పేరుతెచ్చుకున్న నటులు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వారులో ఒకరు రాయల ఆర్‌.హరిశ్చంద్ర. ఆయన స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి నాటకాల్లో నటిస్తూ ఇప్పటికీ ఆ రంగాన్ని తన తల్లిగా భావిస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఆయన నాటకాలు చేస్తున్నారు. ఇక మేకప్‌ ఆర్టిస్ట్‌గా సైతం పేరుతెచ్చుకున్న హరిశ్చంద్ర దేశంలోనే మొదటి సారిగా మేకప్‌, కాస్ట్యూమ్స్‌ అంశాలపై పిహెచ్‌డి చేసిన వ్యక్తి కావడం గమనార్హం. 

నటనలో బహుముఖ ప్రజ్ఞాశాలి...
రాయల హరిశ్చంద్ర జన్మస్థలం అనంతపురం జిల్లాలోని గుంతకల్‌ ప్రాంతం. ఆయన అక్కడే పాఠశాల, కళాశాల విధ్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆయన ఎనిమిదవ తరగతి నుంచి పాఠశాలల్లో నాటకాలు వేస్తూ ఉపాధ్యాయులు, తన తోటి విద్యార్థుల చేత శెభాష్‌ అనిపించుకున్నారు. అనంతరం గుంతకల్‌ ఎస్‌కెపి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆయన పలు నాట కాల పోటీల్లో నటించి ఉత్తమ రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఇక హరిశ్చంద్ర తండ్రి హెచ్‌.రామాంజనేయులు సైతం రంగస్థల నటులే కాకుండా నాటకాల దర్శకులు కూడా. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే ఆయన తరచుగా నాటకాల్లో నటించి ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఆయన తన కుమారుడిని నాటకాల్లో నటించేందుకు చిన్నతనం నుంచి ఎంతో ప్రోత్సహించేవారు. తండ్రి ప్రోత్సాహంతో హరిశ్చంద్ర ఎంతో ఉత్సాహంగా పాఠశాల, కళాశాల స్థాయిలో నాటకాలు వేసేవారు. 
ఉత్తమ రంగస్థల నటునిగా...
harichandra3
గుంటూరులోని హిందూ కాలేజీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా 1986, 87, 88 సం వత్సరాల్లో నాటకాల పోటీలను నిర్వహిం చారు. ఈ పోటీల లో భాగంగా నిర్వ హించిన నాట కా ల్లోని పాత్రల్లో నటించడమే కాదు జీవించి వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ రంగస్థ ల నటునిగా అవార్డులు పొంది ఎంతో పేరుతె చ్చుకున్నారు. ‘హిందూ కాలేజీ నాటకాల పోటీ ల్లో ఉత్తమ రంగస్థల నటునిగా వరుసగా మూడు సార్లు ...అవార్డులు గెలుపొందడం నా జీవితంలో పెద్ద మలుపు. ఈ అవార్డులు అందు కోవడం నాకు జీవితంలో మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది. ఆ తర్వాత నాటక రంగంలో వెనుదిరిగి చూడకుండా ఎదగగలిగాను’ అని హరి శ్చంద్ర అన్నారు. ఇక ప్రముఖ రంగస్థల నటులు ఆనంద్‌ వద్ద 1983లో హరిశ్చంద్ర నటనలో శిక్షణ పొందారు. సాంఘిక నాటకాల్లో ఏవిధంగా నటించాలో ఆయన వద్ద మెలకువలను నేర్చుకున్నారు. ప్రముఖ రంగ స్థల నటులు, సినీనటులు పుండరీకాక్షయ్య సోదరులైన అట్లూరి బలరామయ్య వద్ద సైతం నటనలో మెలకువలను నేర్చుకొని అంచెలంచెలుగా నాటక రంగంలో ఎదిగారు. ఇక తన తండ్రి మిత్రులైన కోటేశ్వరా వు దగ్గర మేకప్‌లో శిక్షణ పొందారు. 

నటనలో శిక్షణా కోర్సులు...
స్వతహాగా నటనను నేర్చు కున్న హరిశ్చంద్ర యాక్టింగ్‌ లో ప్రొఫెషనల్‌గా శిక్షణ పొం దాలని భావించారు. రైల్వే ఉద్యోగి అయిన తండ్రి హైదరా బాద్‌కు బదిలీ అయిన తర్వాత ఆయన ఈ నగరానికి వచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో 1990సంవత్సరంలో పిజి డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌ కోర్సు చేశారు. ‘నటనలో పిజి డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఆ తర్వాత నా వృత్తి, ప్రవృత్తి నాటకమే అయ్యింది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత నాకు థియేటర్‌ ఆర్ట్‌లోని మెలకువలను నేర్చుకోగలిగాను’ అని హరిశ్చంద్ర పేర్కొన్నారు. ఆ తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీలోనే ఎంఎ థియేటర్‌ ఆర్ట్‌‌సను పూర్తిచేశారు ఆయన. ఆ తర్వాత 1995లో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టును ఆయన పాసయ్యారు. దీంతో లెక్చరర్‌ కావడానికి ఆయన అర్హత లభించి నట్లయ్యింది.
మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన...
దేశంలో మొదటిసారిగా మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన చేసిన వ్యక్తిగా హరిశ్చంద్ర పేరు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్‌ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో ఆయన ఈ అంశాలపై పిహెచ్‌డి చేశారు. ‘భాగవతాలు’ అంశంలో ఆహార్యం, మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన చేయాలని సుధాకర్‌రెడ్డి సూచించారు. ఆయ న సూచనల మేరకు చిందు భాగవతంలో మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన చేశాను. ఈ మేరకు చేసిన పరిశోధనకు గాను నాకు పిెహచ్‌డి లభించింది. 2000లో డాక్టరేట్‌ పూర్తి చేయడం నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. దేశంలోనే మొదటిసారిగా మేకప్‌, కాస్ట్యూ మ్స్‌పై పిహెచ్‌డి చేయడంతో అందరి దృష్టిలో పడినట్లయ్యింది. దీంతో నాకు పలువురు ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీ రిలో రంగస్థల ప్రముఖులు భాస్క ర్‌ శివాల్కర్‌, ఎన్‌.జె.భిక్షు, డాక్టర్‌ చాట్ల శ్రీరాములు, డాక్టర్‌ ప్రసా ద్‌రెడ్డి, ప్రొఫెసర్‌ నాగభూషణ శర్మ, డి.ఎస్‌.దీక్షిత్‌ వంటి వారితో పరిచయం ఏర్పడింది’ అని హరి శ్చంద్ర చెప్పారు. ‘పిహెచ్‌డి చేస్తు న్న సమయంలోనే సెంట్రల్‌ యూ నివర్సిటీ నన్ను గెస్ట్‌ ఫ్యాల్టీగా, మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఎంతో ప్రోత్స హించింది. ఆర్థికంగా సహాయ పడడమేగాకుండా నటునిగా నాకు గుర్తింపునిచ్చింది’ అని ఆయన తెలిపారు. 
ప్రముఖ రంగస్థల నటునిగా...
డాక్టరేట్‌ పూర్తయిన అనంతరం హరిశ్చంద్ర రసరంజని సాంస్కృతిక సంస్థ ద్వారా పలు నాటకాల్లో నటించారు. నాటకాలతో పాటు మేకప్‌ ఆర్టిస్ట్‌గా సైతం చేశారు. తల్లవఝ్జుల సుందరం దర్శకత్వంలో ఎన్నో నాటకాలు చేశారు. అనంతరం డాక్టర్‌ ప్రసాద్‌రెడ్డి, డి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఎం.ఎన్‌.శర్మ, చాట్ల శ్రీరాములు దర్శకత్వంలో పలు నాటకాల్లో ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2005లో ఆయన ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశానికి వెళ్లి అక్కడ ఐదేళ్ల పాటు నటన, దర్శకత్వం, మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి గత ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ‘ఎరిత్రియాలో పనిచేసిన అయిదేళ్ల సమయంలో తెలుగు నాట రంగాన్ని ఆ దేశవాసులకు పరిచయం చేశాను. అక్కడ మొదటిసారిగా వరుసగా మూడేళ్ల పాటు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరిపించాను. అనం తరం నాలుగవ సంవత్సరం నుంచి అక్కడి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికా రికంగా జరిపిస్తోంది. అయిదేళ్ల పాటు ఎరిత్రియా దేశంలో గడపడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అక్కడి వారు తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొని ఎంతో ముగ్దులయ్యారు’ అని హరిశ్చంద్ర పేర్కొన్నారు. 
సినిమా, టివి, రేడియోలో నటనానుభవం...
రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్న హరిశ్చంద్రకు పలు టివి ఛానెల్స్‌లో అవకాశాలు వాటంతటవే లభించాయి. ఆయన దూరదర్శన్‌, జెమిని, ఈటివి, ఈటివి2 ఛానెల్స్‌లో ఇప్పటివరకు 100కు పైగా సీరియల్స్‌లో నటించారు. వీటిలో రుతు రాగాలు, కస్తూరి, సంగ్రామం, ముగ్ద, సినిమానందలహరి, అంతులేని కథ, స్వాతి చినుకులు, పంచమవేదం, మహాకవి ధూర్జటి వంటి పేరొందిన సీరియల్స్‌ ఆయనకు ఎంతో పేరును తీసుకువచ్చి పెట్టాయి. ఇక సినిమాల్లో సైతం ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చాయి. వీటిలో ఒక్కడు, అర్జున్‌, అతడు, రెండేళ్ల తరువాత, అక్టోబర్‌ 19, ఖలేజా చిత్రాల్లో ఆయన నటించారు. ‘సినీ దర్శకులు త్రివిక్రమ శ్రీనివాస్‌, గుణశేఖర్‌ వంటి వారు నన్ను బాగా ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో పలు హిట్‌ సినిమాల్లో నటించగలిగాను ’అని హరిశ్చంద్ర పేర్కొన్నారు.

దక్కిన అవార్డులు...
దాదాపు 30 సంవత్సరాలుగా నటనా రంగంలో కొనసాగుతున్న హరిశ్చంద్రకు ఎన్నో అవార్డులు దక్కాయి. గత ఏడాది మే నెలలో బిహెచ్‌ఇఎల్‌ నిర్వహించిన 32వ ఆలిండియా డ్రామా కాంపిటీషన్స్‌లో ఆయనకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు, బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు, బెస్ట్‌ ప్రొడక్షన్‌ అవార్డులు లభించడం ఆయన బహు ముఖ ప్రజ్ఞకు అద్దం పడుతుంది. పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన 12వ ఆలిండియా డ్రామా కాంపిటీషన్స్‌లో ఆయన బెస్ట్‌ విలన్‌, యువ కళావాహిని 2005లో నిర్వహించిన ఆలిండియా డ్రామా కాంపిటీషన్స్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌ అవార్డులు లభించాయి. వీటితో పాటు మూడు దశాబ్దాలుగా ఆయనకు ఎన్నో అవార్డులు దక్కాయి.

Source: www.suryaa.com

No comments:

Post a Comment